బావిలో దూకి వివాహిత ఆత్మహత్య
కోరుట్ల, డిసెంబర్ :7 (9వ్యూస్) పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రాంతానికి చెందిన ఓవివాహిత బావిలో దూకి ఆత్మహత్య కు పాల్పడింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రాంతంలో గల ఎల్లమ్మ రోడ్ కు చెందిన ఆడెపు రచన (27) అనే మహిళ అత్తగారు వేధింపులతో గత కొద్ది కాలంగా తల్లి గారి ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన రచన ఆ కాలని శివారులో గల ఓ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా మృతురాలికి నాలుగు సంవత్సరాల కూతురు ఉంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

