పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కోరుట్ల, డిసెంబర్ :7 (9వ్యూస్) మహాత్మా విద్యానికేతనం 2004 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కోరుట్ల కావేరి గార్డెన్స్ లో అట్టహసహం గా ఆనందం గా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు విద్యనభ్యసించే సమయంలో చేసిన ఆటలు, పాటలు గుర్తు చేసుకున్నారు. అనంతరం విద్యను బోధించిన గురువులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుమల శోభ, రాజేశ్వరి, సునీత, నవీన్, శ్రీవాణి, మహదేవ్, ప్రవీణ్, నరేందర్, నరసింహ చారి, మనోహర్, రాజేంద్ర ప్రసాద్ విద్యార్థులు కార్తీక్, రాజారమేష్, నాగరాజు, మహేష్, వెంకటేశ్వర్, నవీన్, శైలేందర్, ధీరజ్, మమత, స్నేహ, అపర్ణ, భాగ్య, వినుప్రియ, నిరుప, తదితరులు పాల్గొన్నారు

