అవకాశం ఇస్తే అభివృద్ధికి కృషి
కథలాపూర్, (కోరుట్ల) డిసెంబర్; 7 (9వ్యూస్)ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానంటూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థి బైర మల్లేశం స్పష్టం చేశారు. ఆదివారం రోజు వాడ వాడల తిరుగుతూ ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు. గ్రామాల్లోని అన్ని వాడల్లో సిసి రోడ్లు, మురికి కాలువలు నిర్మిస్తానని, పారిశుద్ధం లోపించకుండా చేస్తానని ఎమ్మెల్యే ఆది శ్రీనన్న ఆశీర్వాదంతో ముందుకు వస్తున్నట్లు ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నాడు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చెదలు సత్యనారాయణ, బైర దేవ్ యాదవ్, చెదలు తిరుపతి, నల్లూరి కిషన్, గాజా ప్రభాకర్, లోక నర్సారెడ్డి, పెద్ద భూమ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

