ఘనంగా విజయ్ దివస్ వేడుకలు

 ఘనంగా విజయ్ దివస్ వేడుకలు

తెలంగాణ తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం....




కోరుట్ల, డిసెంబర్: 9 (9వ్యూస్) కేసీఆర్ ఆమరణ దీక్షతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ను ప్రకటించిన రోజైన డిసెంబర్ 9 వ తేదీని పురస్కరించుకొని పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టారని, ఆయన ఉద్యమ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల ధైర్యసాహసం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.