ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

 ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు



కోరుట్ల, డిసెంబర్;9 (9వ్యూస్) కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గొప్ప త్యాగశీలి అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్లో జరిగిన వేడుకలలో కృష్ణారావు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి మాట్లాడుతూ యూపీఏ పార్లమెంటరీ పార్టీ సోనియా గాంధీని నాయకురాలిగా ఎన్నుకున్నప్పటికీ భారతదేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న ఆ పదవిని తిరస్కరించి మన్మోహన్ సింగ్ పేరును సోనియాగాంధీ సూచించారని, ప్రధానమంత్రి పదవిని కూడా వదులుకున్న సోనియా గాంధీ గొప్ప త్యాగశీలి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, నయీమ్, మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నం అనిల్, మాజీ కౌన్సిలర్లు ఎంబేరి నాగభూషణం, యతిరాజం నర్సయ్య, శ్రీరాముల అమరేందర్, జిందం లక్ష్మీనారాయణ, నేమురి భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.