మదనపల్లి జిల్లా, పీలేరు రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఎమ్మెల్యే నల్లారి కృషి ఎనలేనిది.. కూటమి శ్రేణులు.
పట్టణాలు పల్లెలు అభివృద్ధి చెందాలన్నదే వారి అభిమతం.
ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలతో ఉద్భవించిన వ్యక్తి నల్లారి
మదనపల్లి జిల్లా, పీలేరు రెవెన్యూ డివిజన్ కోసం శక్తివంచన లేకుండా అహర్నిశలు కృషిచేసిన పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కు ప్రజా ప్రశంసలు వెలువత్తాయి.
అన్నమయ్య జిల్లా : కలికిరి మండలం నగిరిపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో
పుంగనూరు, మదనపల్లి, పీలేరు నియోజకవర్గ కూటమి శ్రేణులు,ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున గజ పూలమాలతో ఘనంగా సత్కరించారు.
మదనపల్లి జిల్లా, పీలేరు రెవెన్యూ డివిజన్ కోసం పుంగనూరు, పీలేరు, మదనపల్లి నియోజక వర్గాల్లో పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించి, పట్టుదలతో ప్రజాభిప్రాయాలు తెలుసుకుంటూ, తనదైన శైలిలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలకు ఊపిరి పోసి
ఉద్యమించి, ఉద్భవించి ఒక మలుపు తిప్పిన మహనీయుడని, ఆయన చేసిన కృషి ఫలితమే నేడు మదనపల్లి జిల్లా, పీలేరు రెవెన్యూ డివిజన్ గా ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని కూటమి శ్రేణులు పేర్కొన్నారు.
మాజీ మంత్రి అమర్నాథరెడ్డి కాలం నుండి కూడా నల్లారి కుటుంబం సాధించనిది ఏదీ లేదని పట్టణాలు,పల్లెలు, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చందాలన్నదే వారి అభిమతమని అన్నారు.
ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ కిషోర్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో మార్మోగించారు.

