కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరాన్ని వినియోగించుకోవాలి

 కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరాన్ని వినియోగించుకోవాలి


జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి....




కోరుట్ల, డిసెంబర్ :2 (9వ్యూస్) జగిత్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రం లో కుటుంబ నియంత్రణ శిబిరం డిసెంబర్ 1నుండి వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఈ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇస్తామని, అన్ని రకాల సేవలకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పిహెసి ఐలాపూర్ లో ఆశా డే సమావేశం తెలిపారు. గర్భిణీ మహిళలకు సేవలు ఏవిదంగా అందుతున్నాయని, వారికి ఎలాంటి ఇబ్బంది కలిగిన తమను సంప్రదించాలని వారికి సూచించారు. గర్భిణీ స్త్రీలను అడిగి వారి సమస్యలపై ఆరా తీశారు. తల్లి పిల్లల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆశవర్కర్, ఏ ఎన్ ఎం, సూపర్ వైజర్ ల పనితీరు గురించి తెలుసుకున్నారు. పురుషులకు, మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు కుడా నిర్వహిస్తామని తెలిపారు. ఆశా డే సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం అన్ని విభాగాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు సమీనా సూపర్వైజర్ లు ధనుంజయ్, నాగభూషణ్ ఫార్మాసిస్ట్ ఏఎన్ఎం లు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.