వైభవంగా గుంటి పెరుమాండ్ల కళ్యాణం
కోరుట్ల, డిసెంబర్: 02 (9వ్యూస్) కోరుట్ల శివారు లోని అతి పురాతనమైన గుంటి పెరుమాండ్లు దేవాలయంలో మార్గశిర మాస ద్వాదశి రోజున ఉదయం స్వామి మూల విరాట్టుకు ఆలయ అర్చకులు చింత సునీల్ స్వామి ఫల పంచామృత అభిషేకాదులు జరిపారు. అనంతరం లక్ష్మి నారాయణ స్వామి విగ్రహాలను ఊరేగింపుగా దగ్గర లో ఉన్న నదిలోకి తీసుకొని వెళ్లి చక్రస్నానం చేయించారు. కోరుట్ల పట్టణ పురోహితులు బ్రహ్మన్నగారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో స్వామి అమ్మ వార్ల కళ్యాణం, స్థాపిత దేవతా హోమం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. అలాగే ఈ నెల ఐదవ తేది శుక్రవారం రోజున గుంటి పెరుమాండ్ల జాతర మహోత్సవం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమం లో దేషుముఖ్ ఫణింద్ర శర్మ, కుర్జి ఆదిశేషు, బ్రహ్మన్న అరుణ్ శర్మ విజయ్ శర్మ, చింత సురేష్, ప్రవీణ్, పీతాంబర్, ప్రసాద్, కొండల్ రావు, కోరుట్ల పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


