అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి. A. మహేష్, చైర్మన్ మరియు 11 వ అదనపు జిల్లా జడ్జి.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పీలేరు భవిత పాఠశాలలో చైర్మన్,11వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మహేష్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా న్యాయమూర్తి గారు మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడో తేదీన జరుపుకుంటున్నామని, సందర్భంగా దివ్యాంగుల పిల్లల శ్రేయస్సును వారి అభివృద్ధిని కోరుతూ అన్ని రంగాలలో ప్రోత్సహించడం లక్ష్యంగా అన్ని కార్యక్రమాలను అందే విధంగా చూడాలని, సౌకర్యాలను కల్పిస్తూ విద్యాభివృద్ధిని అందిస్తున్నది. వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సామాజిక అభివృద్ధిలో వీరిని కలుపుకొని పురోగతిని పెంపొందించాలని అన్నారు. అంగవైకల్యం ఉన్నవారు అపోహ పడకుండా ధైర్యంగా అన్ని రంగాల్లో దూసుకుపోవాలని వారికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా అందించాలని, అలాగే స్కూల్ అధ్యాపకులు వారికి అందుతున్న సౌకర్యాలను సరైన సమయంలో వారికి చేరే విధంగా చూడాలని, విద్యార్థులకు ఆట పోటీలు నేర్పించాలని అప్పుడే విద్యార్థులు తగిన సమయంలో అన్ని రంగాలలో వస్తారని తెలియజేశారు. కాబట్టి ఇలాంటి విద్యార్థులను అందరూ ప్రోత్సహించాలని తెలియజేశారు.
తరువాత ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకి విద్యార్థులకి బహుమతులు ప్రధానం చేశారు, విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జియావుద్దీన్ షేక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు, పీలేరు మండల అభివృద్ధి అధికారి శివ శంకరయ్య, మండల విద్యాశాఖ అధికారిణి పద్మావతి, మెయిన్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జైపాల్ రెడ్డి, స్పెషల్ ఎడ్యుకేటర్ లలిత కుమారి, భవిత పాఠశాల ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం ధరణిజ, సి ఆర్ పి మురళీధర్ రాజు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

