విశేష అలంకరణలో గోదాదేవి
_ మొదటి రోజు వైభంగా ప్రారంభం అయిన ధనుర్మాస ఉత్సవాలు
_ భక్తుల కోలాహలం నడుమ సాగిన గోదాదేవి తిరుప్పవై సేవకాలం
సూర్యాపేట పట్టణం ( డిసెంబర్ 16) : జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని శ్రీ విజయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ధనుర్మాస వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.అర్చకులు మరింగంటి వరదాచార్యులు గోదాదేవి అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి వివిధ రకాల పూల మాలలతో అలంకరించారు.తదుపరి భక్తులందరూ గోదాదేవి అమ్మవారి తిరుప్పావై సేవాకాలం నిర్వహించి అమ్మవారికి హారతులు పట్టారు. ఈ సందర్భంగా అర్చకుడు మాట్లాడుతూ విశేష మాసంగా కొలిచే ధనుర్మాసం నెల రోజుల పాటు తిరుప్పవై పాశురానుసంధన కార్యక్రమం నిర్వహించటం జరుగుతుంది అన్నారు.విశేష పాశురాలు, వెన్న నివేదన ,కూడారై పాయస నివేదన,గాజుల అలంకరణ,దీపాలంకరణ,వివిధ రకాల విశేష సేవలను ఈ నెలరోజులు జరుపుతామని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోదాదేవి అమ్మవారి అనుగ్రహం పొందగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు ముడంభై రఘువరన్ ఆచార్యులు మరియు ఆలయ కమిటీ సభ్యులు మరియు మహిళా భక్తులు పాల్గొన్నారు.


