అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, దుబ్బ శ్రీకాంత్ దరఖాస్తు
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ "సంస్థాగత నిర్మాణ కార్యక్రమం" (SANGATHAN SRIJAN ABHIYAN)ను ఘనంగా నిర్వహించింది. జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా జరిగిన ఈ సమావేశానికి పార్టీ శ్రేణుల నుండి విశేష స్పందన లభించింది.
ముఖ్య అతిథులుగా హాజరైన పరిశీలకులు:
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ (AICC) అబ్జర్వర్ శ్రీ కె. మహేంద్రన్, ఏపీసీసీ (APCC) అబ్జర్వర్ శ్రీ జంగా గౌతమ్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి రాకేష్ మరియు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలతో సమావేశమై, పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మించుకోవాలనే అంశంపై సన్నాహాలు చేశారు.
జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ:
పార్టీని జిల్లా వ్యాప్తంగా మరింత పటిష్టం చేసే దిశగా, అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఆసక్తిగల నాయకుల నుండి అప్లికేషన్లను ఆహ్వానించారు. ఈ క్రమంలో పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు తన అప్లికేషన్ ను ఏఐసీసీ అబ్జర్వర్ శ్రీ మహేంద్రన్ గారికి అందజేశారు.
పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉంటా: సోమశేఖర్ రెడ్డి
అప్లికేషన్ సమర్పించిన అనంతరం సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. "గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా, నాయకుడిగా పనిచేశాను. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాను. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తాను. నా సేవలను గుర్తించి పార్టీ నాకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే, జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సంపూర్ణంగా బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నాను," అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో *పీలేరు మండల పార్టీ అధ్యక్షులు దుబ్బా శ్రీకాంత్* జిల్లా కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, సేవాదళ్ సభ్యులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నరు

