హెచ్.ఐ.వి. ఉన్నా సురక్షితంగా జీవించవచ్చు

 హెచ్.ఐ.వి. ఉన్నా సురక్షితంగా జీవించవచ్చు



ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పులిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యాన ఆరోగ్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్.ఐ.వి. అనేది మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను నాశనం చేసే వైరస్ అని, ఇది చికిత్స చేయకపోతే ఎయిడ్స్ వ్యాధిగా మారుతుందన్నారు.

హెచ్.ఐ.వి. వల్ల ఇమ్యూనిటీ పూర్తిగా తగ్గిపోయిన చివరి దశను ఎయిడ్స్ అంటారని, ఈ దశలో సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా ప్రాణాపాయంగా మారుతాయన్నారు. అసురక్షితమైన లైంగిక సంబంధాలు, 

హెచ్.ఐ.వి ఉన్న రక్తం మార్పిడి, కలుషితమైన సూదులు ఉపయోగించడం, తల్లి నుండి శిశువుకు ఇది వ్యాప్తి చెందుతుందని, చేతులు కలపడం, ఒకే ప్లేట్లో తినడం వల్ల రాదన్నారు. 

హెచ్.ఐ.వి. ని పూర్తిగా నయం చేసే మందులు ఇంకా లేవని కానీ యాంటీ రిట్రోవైరల్ ధెరపీ ద్వారా వైరస్ ని పూర్తిగా నియంత్రించవచ్చునన్నారు.

కండోమ్ ఉపయోగించడం,

సురక్షిత రక్త మార్పిడి,

ఒక్కసారి ఉపయోగించే సూదులు మాత్రమే వాడటం,గర్భిణి మహిళలకు ముందుగానే పరీక్ష చేసి చికిత్స పొందడం నివారణ మార్గాలని తెలిపారు.

అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా నిర్ధారణ పరీక్షలు చేస్తారన్నారు. హెచ్.ఐ.వి. సోకినంత మాత్రాన జీవితం ముగిసినట్టు కాదని,

సకాలంలో పరీక్ష, సరైన మందులు తీసుకుంటే పూర్తిగా ఆరోగ్యంగా జీవించవచ్చునన్నారు. కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ అపర్ణ, పబ్లిక్ హెల్త్ నర్స్ శ్రీదేవి, ఆరోగ్య విస్తరణాధికారి చంద్రయ్య, పర్యవేక్షకురాలు ప్రమీల మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.