నేత్రపర్వంగా అయ్యప్ప పదునెట్టాంబడి పూజ
కోరుట్ల, నవంబర్: 30 (9వ్యూస్ ) కోరుట్ల పట్టణంలో ఎలిమిల్ల రాజగోపాల్ (సాయిరాం గోపాల్) 36 వ దీక్ష సందర్భంగా ముక్కాస్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం రోజు చిద్రాల నారాయణ గురు స్వామి ఆధ్వర్యంలో అర్చకులు పాలెపు రాము శర్మ వైదిక నిర్వహణలో పదునెట్టాంబడి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా పుణ్యహవచనం, గణపతి సుబ్రహ్మణ్య, నవగ్రహ, గౌరీ, అయ్యప్ప, శ్రీ చక్రార్చన, పద్దెనిమిది మెట్ల పూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో మాల వేసుకున్న స్వాముల భజనలు, పూజ భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని రవీందర్ భక్తి వీడియో వారు ప్రత్యక్ష ప్రసారం చేశారు. పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అందించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, తోట రాజు, కోశాధికారి జూంబర్తి రమేష్, గురు స్వాములు, వెంకటేశ్వర రావు, జితేందర్, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, కోటేశ్వర్, రాజేందర్ పెద్ద ఎత్తున అయ్యప్ప దీక్ష పరులు, భక్తులు పాల్గొన్నారు.


