దుర్వాసనతో బండమీద హరిజనవాడ
పీలేరు,అన్నమయ్య జిల్లా:పీలేరు మండలం దొడ్డుపల్లి గ్రామంలోని బండమీద హరిజనవాడ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన డ్రైనేజ్ సమస్యపై ఏ.బీ.ఎమ్.ఎస్.జె.ఏ.సి ఆధ్వర్యంలో పీలేరు మండల అధ్యక్షులు వై. వెంకటరమణ గారి నాయకత్వంలో ఈ రోజు పీలేరు మండల ఎంపీడీవో గారికి అర్జీ సమర్పించడం జరిగింది.
గ్రామస్తులు పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాని పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ప్రత్యేకంగా ఇటీవలి వర్షాల కారణంగా డ్రైనేజ్‌లో నిల్వ నీరు నిలిచిపోయి, ప్రాంతం మొత్తం తీవ్రమైన దుర్వాసన వ్యాపించింది. దోమల పెరుగుదలతో చిన్నపిల్లలు, పెద్దలు విషజ్వరాలు మరియు ఇతర రోగాలకు గురవుతున్న ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
ఈ విషమ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హరిజనవాడలో డ్రైనేజ్ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏ.బీ.ఎమ్.ఎస్.జె.ఏ.సి నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏ.బీ.ఎమ్.ఎస్.జె.ఏ.సి రాయలసీమ కన్వీనర్ గుర్రం నారాయణ, జిల్లా అధ్యక్షులు నక్క వెంకటరమణ, ఏ.బీ.ఎమ్.ఎస్.జె.ఏ.సి జిల్లా కార్యదర్శి మద్దెల రమేష్, నాయకులు గుర్రం లోకనాథం, గుర్రం సురేంద్ర, గుర్రం శివ, గుర్రం నాగేంద్ర, డి. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

