ఎన్టీఆర్ భరోసా" పెన్షన్ పథకం పేదలకు అత్యవసరాలకు ఆదుకుంటూ ఆర్థికంగా అండగా నిలుస్తుందని తెలుగుదేశం పార్టీ పీలేరు పట్టణ అధ్యక్షులు దలవాయి సురేష్ కుమార్ రెడ్డి అలియాస్ (కంచి సూరి) తెలిపారు.
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పిలుపుమేరకు,*
*ఆయన సోమవారం ఉదయం 6 గంటల నుండి పీలేరు పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీలో పలుచోట్ల కూటమి కార్యకర్తలు, సచివాలయ సిబ్బందితో కలిసి అర్హులైన వారికి పెన్షన్ పథకంలో పాల్గొని అందజేశారు.*
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, మంచం పట్టిన వ్యాధిగ్రస్తులకు నాలుగు వేల నుండి 15వేల వరకు ఆర్థికంగా ఆదుకొని అందించడం జరుగుతుందని అన్నారు,*
*గత వైసీపీ ప్రభుత్వ పాలనలో సంవత్సరానికి ₹250 చొప్పున వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారని చాలీచాలని పెన్షన్ తో లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారని,*
*కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సారిగా పేదల పెన్షన్ పై దృష్టి పెట్టి పెన్షన్ పెంచడం పేదలకు పంచడం హర్షణీయమని అన్నారు.*
*ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డి కాలనీ హరి కాలేషా, వాసు, క్లస్టర్, బూత్ కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.*

