భక్తి, నమ్మకం, ధర్మం ఎప్పుడూ ఓడవు
బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వర శర్మ....
కోరుట్ల, డిసెంబర్ :8 (9వ్యూస్ ) సనాతన ధర్మ ప్రచార సమితి, కోరుట్ల ఆధ్వర్యంలో అష్టాదశ పురాణ ప్రవచనాల పరంపరలో భాగంగా బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వర శర్మ శ్రీ విష్ణు మహా పురాణ ప్రవచనం నాలుగవ రోజు సాయంత్రం భక్తి, ఆత్మబోధ, ఆధ్యాత్మిక శాంతి నిండిన వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం రోజు జడభరతుని వృత్తాంతం, భక్త ప్రహ్లాద చరిత్ర, శ్రీ నారసింహ స్వామి ఆవిర్భావం గురించి కళ్ళకు కట్టినట్లు ప్రవచనం చేశారు. ప్రహ్లాదుడు చెప్పే సత్యం భక్తి, నమ్మకం, ధర్మం ఎప్పుడూ ఓడవు అని భగవంతుడు భక్తుని పిలుపు వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడనీ అన్నారు. జడభరతుడు నేర్పేది అహంకారపు భారాన్ని వదిలి, ఆత్మజ్ఞాన మార్గంలో నడిస్తేనే నిజమైన శాంతి లభిస్తుంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తి భావంతో శ్రవణం చేస్తూ, ఆధ్యాత్మిక ప్రసాదాన్ని ఆస్వాదించారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానయజ్ఞం డిసెంబర్ 10 వరకు ప్రతీరోజూ సాయంత్రం 5:30 గంటల నుండి కోరుట్ల వాసవీ కల్యాణ భవనంలో కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, కోశాధికారి రేగుంట రాజారాం, పురాణ కమిటీ చైర్మన్ పడిగెల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరి రాజు, తదితర బాధ్యతలు నిర్వర్తించగా దొంతుల సుందర వరదరాజన్, గుండేటి బృగుమహర్షి, చిదురాల నారాయణ, బచ్చు శ్రీనివాస్, వొటారి చిన్నరాజన్న, అల్లాడి ప్రవీణ్, గంప శివకుమార్, రుద్ర సుధాకర్, కంటాల రవీందర్, మంచాల పద్మావతి, కోటగిరి శైలజ, పాల్గొన్నారు.


