కాజీపేట ఇంజనీరింగ్ బ్రాంచ్ సెక్రటరీ కొదాటి దిలీప్ కి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
9 వ్యూస్ ప్రతినిధి కే సుదర్శన్ డిసెంబర్ 01కాజీపేట :
సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ (SCRES) ఇంజనీరింగ్ బ్రాంచ్ కాజీపేట్ సెక్రటరీగా, అలాగే సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సేవలందిస్తున్న కొదాటి దిలీప్ కార్మికుల ఆశాజ్యోతిగా ఎదుగుతున్నారని సంఘ్ నాయకులు పేర్కొన్నారు.
కార్మికుల ప్రతీ సమస్యను పరిష్కార దిశగా తీసుకెళ్తూ, తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కొధాటి దిలీప్ కు సంఘ్ కార్యకర్తలు ఘనమైన అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ.. ఎం. రాఘవయ్య ఆశీస్సులు, భరణి భాను ప్రసాద్ దిశానిర్దేశం, మాజీ నాయకుడు కొత్త మురళీకృష్ణ అడుగుజాడలు తనకు ప్రేరణగా ఉన్నాయన్నారు.
ప్రభురాజు సారధ్యంలో ఇంజనీరింగ్ బ్రాంచ్ మరిన్ని విజయాలను సాధించాలని, కార్యాచరణలో పారదర్శకతతో, కార్మికుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా తీసుకుని ముందుకు సాగాలని సభ్యులు ఆకాంక్షించారు. అన్ని వర్గాల మన్ననలు అందుకుంటూ మరింత బలోపేతమైన నాయకత్వాన్ని ప్రదర్శించాలని అభిమాన కార్మికులు అభిలషించారు..

