కోరుట్ల గడి బురుజులు పరిరక్షణకు అఖిలపక్ష సమావేశం

కోరుట్ల గడి బురుజులు పరిరక్షణకు అఖిలపక్ష సమావేశం



కోరుట్ల, డిసెంబర్ :1 (9వ్యూస్) కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక గడి బురుజులు, ప్రతి ఏటా నిర్వహించే మహిషాసుర మర్ధిని స్థల పరిరక్షణ కోసం సోమవారం రోజు సి. ప్రభాకర్ భవనంలో అఖిలపక్ష, ప్రజా సంఘాల సమాఖ్య ముఖ్య సమావేశం జరిగింది. వివిధ పౌర సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మత సామాజిక సంస్థల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో గడి బురుజులు మహిషాసుర మర్ధిని స్థల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. కన్వీనర్ గా చెన్న విశ్వనాథం, కో-కన్వీనర్ మొహమ్మద్ ముజాహిద్, శ్రీనివాస్ బాబు, అలీ నవాబ్ లు, ముఖ్య సలహాదారులు గా పేట భాస్కర్, మచ్చ లక్ష్మీపతి, పాతర్ల విజయ్, సుతారి రాములు, పసుల కృష్ణప్రసాద్, రాచకొండ పెద్ద దేనన్న, భూపెల్లి నగేష్, సయ్యద్ అన్వర్ లతో పాటు పట్టణానికి చెందిన మరికొన్ని కుల సంఘాలను, పాత్రికేయులను, న్యాయ వాదులను భాగస్వామ్యం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా కన్వీనర్ చెన్న విశ్వనాథం ఆధ్వర్యంలో డిసెంబర్ 8 వ తేదీన కోరుట్లలో భారీ ధర్నా నిర్వహించేందుకు సమావేశం చేయాలని తీర్మానించడం జరిగింది. ప్రతి పౌరుడూ పరిరక్షణలో భాగస్వామి కావాలి అన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.