మండల కేంద్రంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ
కథలాపూర్, డిసెంబర్: 1 (9వ్యూస్) కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కథలాపూర్ వైద్యాధికారి డా.పి.సింధూజ ఆధ్వర్యంలో సోమవారం రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కథలాపూర్ మండల కేంద్రంలో హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అనేది హెచ్ఐవి ఎయిడ్స్ కు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడానికి చేసిన ప్రపంచ ఉద్యమం అని అన్నారు. రెడ్ రిబ్బన్ అనేది హెచ్ఐవి తో నివసించే ప్రజలకు అవగాహన, మద్దతు యొక్క సార్వత్రిక చిహ్నం అని తెలిపారు. అన్ని గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అడ్డంకులను అధిగమిద్దామని, ఎయిడ్స్ ప్రతిస్పందన ను మారుద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా.పి. సింధూజ, సి. హెచ్.ఓ.లు టి. వేణుగోపాల్, ఐ. సుగుణ, హెల్త్ సూపర్వైజర్ టి. శ్రీధర్, ఫార్మసిస్ట్ లు, స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్లు, ఎంఎల్ హెచ్ పీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

