స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి
అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి....
ఇబ్రహీంపట్నం, (కోరుట్ల) డిసెంబర్: 9 (9వ్యూస్) రాబోవు సర్పంచ్ సాధారణ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి మంగళవారం రోజు కోరుట్ల నియోజక వర్గంలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, టిఎస్ మోడల్ స్కూల్ ని సందర్శించారు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి హనుమాన్ చెక్ పోస్ట్ ని కూడా సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదనపు ఎస్పీ వెంట డీఎస్పీ ఏ. రాములు, మెట్ పల్లి సిఐ వి. అనిల్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్, మెట్పల్లి ఎస్సై కిరణ్ కుమార్, మెట్పల్లి సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

