బాపూజీనగర్‌లో అరుంధతి మాదిగ కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు
ధన్వంతరి డాక్టర్ నాగరాజ్ వైద్య సేవలు – 100 మందికి పైగా పరీక్షలు
9 వ్యూస్ ప్రతినిధి కే సుదర్శన్ కాజీపేట, బాపూజీనగర్:30 బాపూజీనగర్ ఎస్.ఎం. క్లినిక్ ఆవరణలో అరుంధతి మాదిగ కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 9 గంటలకు మెడికల్ క్యాంపు ప్రారంభమైంది. క్యాంపులో వైద్య సేవలను ప్రముఖ ధన్వంతరి వైద్య నిపుణులు డాక్టర్ నాగరాజ్ అందించారు.
క్యాంపు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే 60 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించబడినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఈ క్యాంపులో ప్రధానంగా —
నడుమునొప్పి, మెడనొప్పి,
కండరాల నొప్పులు,కీళ్ల నొప్పులు
శరీర నర సంబంధిత సమస్యలు
వంటి వ్యాధులపై ప్రత్యేక పరీక్షలు, చికిత్సా సలహాలు అందించామని డాక్టర్ నాగరాజ్ వివరించారు.
క్యాంపు సాయంత్రం 5 గంటల వరకు నిరంతరంగా కొనసాగి, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు..
ఈ సందర్భంగా పసునూరి మనోహర్: మాట్లాడుతూ ..
“ప్రజల ఆరోగ్యమే మా ప్రధాన ధ్యేయం”
అని అరుంధతి మాదిగ కుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు పసునూరి మనోహర్ అన్నారు.
“కాజీపేట పట్టణ ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యం. పేదలకు మరియు అవసరమైన వారికి వైద్య సేవలను అందించేందుకు మా సంఘం నిరంతరం శ్రమిస్తోంది. ధన్వంతరి డాక్టర్ నాగరాజ్ వంటి నిపుణులు ముందుకు వచ్చి సేవలు అందించడం మా అదృష్టం. భవిష్యత్తులో కూడా ఇంకా అనేక మెడికల్ క్యాంపులను నిర్వహించి ప్రజలకు చేరువవుతామని” అన్నారు.
ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని, తమ సమస్యలకు నిపుణుల వద్ద పరీక్షలు చేయించుకోవాలని సంఘం విజ్ఞప్తి చేసింది.
ఈ కార్యక్రమంలో ...
కన్వీనర్ మేకల మల్లికార్జున్. సంఘం గౌరవ అధ్యక్షుడు పసునోరి మనోహర్.
కో కన్వీనర్, రామగిరి శ్రీనివాస్. ఆర్గనైజర్ వనపాకల రాజేందర్..
తదితర సంగసబ్యలు పాల్గొన్నారు.

