జాతీయ న్యాయ దినోత్సవo

జాతీయ న్యాయ దినోత్సవo 



 జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26 న జరుపుకుంటారని చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా జడ్జిగారు ఏ మహేష్ తెలియజేశారు. 1979 నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 26 న జాతీయ లా డే నిర్వహించాలని ప్రకటించారు. రాజ్యంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం. కాబట్టి రాజ్యాంగ ముసాయిదా ప్రతులు తొలి సంతకాలు రోజైన నవంబర్ 26 వ తేదీన జాతీయ న్యాయ దినోత్సవాంగా ఎంచుకొన్నారు. ఈ దినోత్సవo నాడు న్యాయవాదులు సమావేశమై న్యాయాన్ని కాపాడుతామని న్యాయ ప్రతిజ్ఞ చేస్తారు. పీలేరు 11వ అదనపు పబ్లిక్ హాలు నందు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది చేత 11 జిల్లా జడ్జి గారు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జియావుద్దీన్ షేక్, బార్ అధ్యక్షులు బీసీ పురుషోత్తం రెడ్డి సెక్రటరీ ఆర్ చంద్రశేఖర్ మరియు సీనియర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.