కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ నోటిఫై చేయడం పైబగ్గుమన్న కార్మిక సంఘాలు..

 కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ నోటిఫై చేయడం పైబగ్గుమన్న కార్మిక సంఘాలు..



2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు కార్మిక ఉద్యోగులకు రక్షణగా ఉన్న చట్టాలను తొలగించి వాటి ఫలాలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు అనేకమార్లు అనేక రూపాల్లో ప్రయత్నించగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కోట్లాదిమంది కార్మికులు వీధుల్లోకి వచ్చి ఆరు ఏడు సార్లు దేశం యొక్క సమ్మె చేయడంతో తొలగిన కేంద్ర ప్రభుత్వం నిన్నటికి నిన్న లేబర్ కొడుకు చేయడానికి కార్మిక సంఘాలు మండిపడ్డాయి. సీఐటీయూ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శనివారం పీలేరు గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామపంచాయతీ కార్మికులు, రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామయ్య ఆధ్వర్యంలో లేబర్ కోసం రద్దు చేయాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సందర్భంగా వెంకట రామయ్య గారు మాట్లాడుతూ కార్పొరేట్లకు లాభాలు తెచ్చి పెట్టేందుకు కార్మికులు నడ్డి విరిచి ఉద్యోగ భద్రత లేకుండా పని గంటలు పెంచి శారీరక మానసిక శ్రమ పెంచి సమాజంలో అసమానతలు సృష్టించడానికి ప్రయత్నించడం దుర్మార్గం అన్నారు. లేబర్ కోడ్ల మీద నోటిఫై చేయడంతో కార్మికులకు సామాజిక భద్రతతో పాటు పేదరికం నిరుద్యోగం ఆకలిచావులు పెరుగుతాయని ఆరోపించారు. బీజేపీ తెస్తున్న లేబర్ కోడ్లను రాష్ట్రంలోని కూటమీ ప్రభుత్వం కూడా బలపరచడం దుర్మార్గం అని తెలిపారు ఎన్నికలకు ముందు కార్మికుల సంక్షేమ ధ్యేయమంటూ ఎన్నికల తర్వాత కార్మికులకు నష్టదాయకమైనటువంటి పనులు చేపట్టడం బాధాకరమన్నారు . సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్న నిబంధన కూడా గాలికి వదిలేయడం కమిషన్ల కొరకు కార్పొరేట్లకు జపం చేయడం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మానుకోకపోతే వచ్చేకాలంలో కార్మిక సంఘాల ప్ర జానీకాన్నికూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఓడించడానికి రాజకీయ కర్తవ్యంతీసుకుంటామని హెచ్చరించారు.పీలేరు అధ్యక్షులు బివి రమణ ప్రధాన కార్యదర్శి ఓబులయ్య కోశాధికారి బి నాగార్జున పులి రెడ్డప్ప డి రమేష్.ఎస్ మస్తాన్ రాజేశ్వరి సరోజశాంతి కుమారి కంప్యూటర్ వెంకటరమణ ఎల్లయ్య నాగమ్మ నజీర్ కార్మికులందరూ పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.