నల్లగొండ డిసిసి అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నియామకం పట్ల హర్షం
వేములపల్లి మాజీ సర్పంచ్ నాగవెళ్లి మధు
వేములపల్లి(9 వ్యూస్) నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన పున్న కైలాష్ నేతను ఎంపిక చేయడం పట్ల వేములపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు నాగవెళ్లి మధు హర్షవ వ్యక్తం చేశారు. బుధవారం స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకుడు యువకుడు పున్నా కైలాష్ నేతను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించడంతో కాంగ్రెస్ పార్టీ బిసి వర్గాల కు సమచిత స్థానం కల్పించిందన్నారు. పున్న కైలాష్ నేత నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాలలో విజయ దుందుభి మోగించడం ఖాయమని ఆయన ఆశ భావం వ్యక్తం చేశారు.

