డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయ్యూబ్ ఆధ్వర్యంలో వక్ఫ్ యూజర్ కార్యక్రమం

 డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయ్యూబ్ ఆధ్వర్యంలో వక్ఫ్ యూజర్ కార్యక్రమం


9 వ్యూస్ ప్రతినిధి కే సుదర్శన్ వరంగల్: నవంబర్ 27 కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయ్యూబ్  అధ్యక్షతన వక్ఫ్ బోర్డు యూజర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.



ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని మాట్లాడుతూ, ఉమ్మీద్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులు—ఖాంకాలు, ఈద్గాలు, ఆహూర్ ఖానాలు, మస్జిద్లు, మదర్సాల‌కు సంబంధించిన డాక్యుమెంట్లను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తుల రక్షణ, పారదర్శక నిర్వహణ కోసం డిజిటల్ డాక్యుమెంటేషన్ అత్యంత కీలకమని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో ఉలేమా ఈక్రమ్, హఫేజ్లు, ముతవల్లీలు, హన్మకొండ జిల్లా మైనారిటీ చైర్మన్ మీర్జా అజీజుల్లా బైగ్, వైస్ చైర్మన్ ఎం.ఏ. షబ్బీర్ (తబ్బు), జిల్లా జనరల్ సెక్రటరీ ఎం.డి. షాకీర్, సయ్యద్ జాహెద్ అలీ, బాషా, టింకు తదితరులు పాల్గొన్నారు.

అంతేకాక ఈ సందర్భంగా, కొత్తగా నియమితులైన డీసీసీ ప్రెసిడెంట్ వరంగల్ తూర్పు మహ్మద్ అయ్యూబ్ ని నాయకులు, హాజరైన అతిథులు అభినందించి సన్మానించారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.