క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి

క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు...



కోరుట్ల, నవంబర్ :16 (9వ్యూస్ ) క్రీడలు దేహదారుడ్యం తో పాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఖోఖో పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారుల కోటను త్వరలోనే భర్తీ చేసే ఆలోచనతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ క్రీడా నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు


క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, శారీరక మానసిక దృఢత్వానికి పునాది

కోరుట్ల ఎమ్మెల్యే

డా. కల్వకుంట్ల సంజయ్....




కోరుట్ల కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అండర్ 18 ఖోఖో టోర్నమెంట్, సెలెక్షన్స్ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు కేవలం ఆటలు మాత్రమే కావని అవి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, శారీరక మానసిక దృఢత్వానికి పునాది అన్నారు. టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలు, ఓర్పు, పట్టుదల వంటి విలువలు క్రీడల ద్వారానే నేర్చుకుంటారని తెలిపారు. ఖోఖో వంటి భారతీయ క్రీడలకు యువతలో పెరుగుతున్న ఆదరణ ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి తనవంతు ప్రోత్సాహం, అవసరమైన సదుపాయాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆటగాళ్లను అభినందిస్తూ, ఎంపికలలో ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కోరుట్ల స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.