ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించడం అరవింద్ కు తగదు
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు....
కోరుట్ల, నవంబర్: 12 (9వ్యూస్) సంపన్న కుటుంబంలో జన్మించిన, దేశ రక్షణ కోసం భారత వాయు సేనలో సైనికుడిగా చేరి దేశానికి సేవలందించిన రాష్ట్ర పౌరసరఫరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డిని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ అవినీతి పరుడు అని విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం రోజు కోరుట్లలో పత్రిక విలేకరులతో మాట్లాడుతూ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు ఏం ఒరగబెట్టావ్ అని నీలదీశారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ అధికార పార్టీ ఎంపీ అయి ఉండి కేంద్రం నుంచి నిధులు సాధించడంలో పూర్తిగా విఫలమయ్యాడని అన్నారు. నిజాయితీ పరుడైన మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తే సహించబోమని అన్నారు.

