కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం రోజు పట్టణానికి చెందిన 1,43,16,588/- విలువ గల 143 కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులతో పాటు మండలానికి చెందిన 2,98,000/- విలువ గల 13 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద యువతి వివాహానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు కేసిఆర్ ప్రారంభించారని అన్నారు. 420 హామీలు నెరవేరుస్తామన్న వాగ్దానం కేవలం మాటల్లోనే మిగిలిపోయిందని అబద్ధాలు, వంచనలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. ప్రజల అభివృద్ధి సంక్షేమమే బి ఆర్ ఎస్ పార్టీ లక్ష్యమని కేసీఆర్ ఆలోచనలతో ముందుకు సాగుతూ ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని తెలిపారు.

