జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన టీఎస్ జె యు జిల్లా నూతన కమిటీ
కోరుట్ల, నవంబర్: 12 (9వ్యూస్)తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ( టిఎస్జేయూ ) జగిత్యాల జిల్లా అధ్యక్షులు డా. పేట భాస్కర్, ప్రధాన కార్యదర్శి జోరిగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లాలో నూతన కమిటీ ఎన్నికైన సందర్బంగా కమిటీ నాయకులతో కలిసి జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్పీని శాలువాతో సన్మానించి పూల బొకే అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ లకు సంబందించిన పలు అంశాలపై, సమస్యలపై విన్నవించగా ఎస్పీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో టిఎస్జేయూ నాయకులు పాల్గొన్నారు.

