అంగ రంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ

 అంగ రంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ




కోరుట్ల, నవంబర్: 27 (9వ్యూస్ )కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్ లో నల్ల రతన్ 18 వ దీక్ష సందర్భంగా గురువారం రోజు గురు స్వాములు చిద్రాల నారాయణ, సాయిరాం గోపాల్ ఆధ్వర్యంలో అర్చకులు పాలెపు రాము శర్మ వైదిక నిర్వహణలో మెట్ల పూజను ఘనంగా నిర్వహించారు. ముందుగా పుణ్యహవచనం, గణపతి సుబ్రహ్మణ్య, నవగ్రహ, గౌరీ, అయ్యప్ప, శ్రీ చక్రార్చన, పద్దెనిమిది మెట్ల పూజను అంగరంగ వైభవంగా నిర్వహించగా భక్తుల భజనలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతను చోటు చేసుకుంది. కార్యక్రమంలో అయ్యప్ప మాల వేసుకున్న స్వాముల "పేటతుళ్ళి ఆట" వచ్చిన భక్తులను ఆకట్టుకుంది. పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, తోట రాజు, కోశాధికారి జూంబర్తి రమేష్, పెద్ద ఎత్తున అయ్యప్ప దీక్ష స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.