డీజిల్ కాలనీ చౌరస్తాలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి

 డీజిల్ కాలనీ చౌరస్తాలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి

 

9 వ్యూస్ ప్రతినిధి కే సుదర్శన్ నవంబర్ 28:కాజీపేట డీజిల్ కాలనీ చౌరస్తాలో మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసునూరి మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తొలుత మహాత్మ ఫూలే చిత్రపటానికి పార్టీ నాయకులు, బీసీ నాయకులు రాజారపు యాదగిరి, కొమరవెల్లి శ్రీనివాస్ తదితరులు పూలమాలలు అర్పించి నివాళులు సమర్పించారు.



ప్రధాన అతిథిగా పాల్గొన్న పసునూరి మనోహర్ మాట్లాడుతూ—

“జ్యోతిరావు ఫూలే 18వ శతాబ్దంలో అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఐక్యతకు అపార సేవలు చేశారు. 1848లో దేశంలోనే తొలి బాలికల పాఠశాలను స్థాపించి బాలికల విద్యాభివృద్ధికి మార్గం సుగమం చేశారు. 1868లో అస్పృశ్యులకు నీటి మరియు వసతి సదుపాయాలు కల్పించిన తొలి సామాజిక సంస్కర్తగా నిలిచారు. 1873లో సత్యశోధక్ సమాజం స్థాపించి సామాజిక సమానత్వం కోసం ఉద్యమించారు. ‘గులాంగిరి’, ‘షిత్కర్యాచా ఆసుద్’ వంటి రచనల ద్వారా సమాజానికి చైతన్యం తీసుకువచ్చారు” అని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గబ్బెట ఎల్లేష్, కొమరవెల్లి శ్రీనివాస్, బాదావత్ రాము, కేశబోయిన రమేష్ కుమార్, ఎర్ర శ్రీనివాసరావు, పొలిమేర గోపి, పొడి శెట్టి జార్జి, రాజారపు యాదగిరి, మహమ్మద్ బిలాల్, మాచర్ల శేఖర్, కంకణాల సురేందర్, సిరిసిపల్లి సుధాకర్, కొండ్ర తిరుపతి, నదునూరి జానకిరామ్, నందిపాక శంకర్, కందిరాజు, బొడ్డు దేవయ్య, నదునూరి శ్రీనివాసరావు, టీ. సమ్మయ్య, నదునూరి దుర్గాప్రసాద్, అచ్చయ్య, ఐలయ్య, వి. శ్రీనివాస్, నదునూరి రాజా లక్ష్మణ్, రాజు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


నాయకులు మహాత్మ ఫూలేకు నివాళులు అర్పించిన అనంతరం స్థానిక ప్రజలకు పండ్ల పంపిణీ నిర్వహించారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.