సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

 సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు


అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలను పాటించాలి...


జిల్లా ఎస్పి అశోక్ కుమార్....



కోరుట్ల, నవంబర్ :27 (9వ్యూస్) కోరుట్ల నియోజకవర్గం లో సర్పంచ్ ఎన్నికల మొదటి విడత నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మొదటి విడతలో బాగంగా ఎన్నికలు నిర్వహించే గ్రామ పంచాయతీలు, వార్డులకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభ కావడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లును చేయడం జరిగిందని అన్నారు. కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిదిలోని ఐలాపూర్, పైడిమడుగు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రక్రియను గురువారం రోజు డీఎస్పీ తో కలిసి పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిది నిబంధన, 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలని అన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్.ఐ లు చిరంజీవి, రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.