మాలమహానాడు రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ కరపత్రాలు ఆవిష్కరణ

మాలమహానాడు రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ కరపత్రాలు ఆవిష్కరణ



మాలమహానాడు రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని నేడు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం అశోక్ నగర్ కాలనీ నందు మాజీ ఎం.పీ.టీ.సీ. నారదళ్ళ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళిత బహుజనులు నిత్యం అత్యాచారాలకు అఘాయిత్యాలకు సాంఘిక బహిష్కరణలకు గురవుతున్నారని పాలకుల కపట ప్రేమకు గురై దళితులు నిట్ట నిలువుగా చీలిపోయారని అనైక్యత వల్ల మాలలకు అన్యాయం జరిగిందని దళిత వర్గాలపై జరుగుతున్న సాంఘిక బహిష్కరణలు మహిళలపై అత్యాచారాలు మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు మహాసభకు ఆంధ్ర, తెలంగాణ,తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల మాల మేధావులు, సామాజిక కార్యకర్తలు,మహాసభకు విచ్చేస్తున్నారని సభను విజయవంతం చేయడానికి చిత్తూరు జిల్లాలోని మాలమహానాడు కార్యకర్తలు నాయకులు కలసికట్టుగా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సత్తా చాటాలని ఈ నెల నవంబర్ 16 ఆదివారం నాడు అన్నమయ్య జిల్లా మదనపల్లి నందు CSI JCM కమ్యూనిటి హలు నందు జరుగు మాలమహానాడు రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో డి.బి.యస్.యఫ్. ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు బద్దె భాను ప్రకాష్, మాజీ సర్పంచ్ గడ్డం నడిపన్న, గడ్డం భాస్కర్, మద్దెల సిద్ద రామయ్య, సాయి కిరణ్, అనూరాధ, శారదా, రోజా, ముత్యాలమ్మ, కమలనీ, శ్యామల, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.