జనసేన పార్టీ బలోపేతం దిశగా కలప రవి చురుకైన పర్యటనలు

 జనసేన పార్టీ బలోపేతం దిశగా కలప రవి చురుకైన పర్యటనలు


పీలేరు, నవంబర్ 12:ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మరియు పీలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టర్ కలప రవి బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


ముందుగా విజయవాడలో కనకదుర్గమ్మ దేవస్థానం పాలకమండలి సభ్యురాలు రమాదేవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారి బ్రేక్ దర్శనం చేసుకుని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.


తదుపరి వెలగపూడి సచివాలయంలో పీలేరు ఏఎంసీ డైరెక్టర్‌గా నియామకం అనంతరం, కలప రవి ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఓ.ఎస్.డి వెంకటకృష్ణ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవహారాలు, స్థానిక అభివృద్ధి అంశాలపై చర్చించారు.



తరువాత మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తుళ్ళి ని మర్యాదపూర్వకంగా కలుసుకుని సత్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకలాపాలు, స్థానిక పరిస్థితులు, పార్టీ బలోపేతంపై విశదంగా చర్చించారు. త్వరలో నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులతో సమీక్షలు నిర్వహించనున్నట్లు రామ్ తుళ్ళి తెలిపారు.


ఈ పర్యటనలో తనతోపాటు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి శివయ్య, చిత్తూరు ముత్యాలమ్మ దేవస్థానం బోర్డు డైరెక్టర్ పి. ధరణికుమార్ పాల్గొన్నట్లు కలప రవి తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.