హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యువజన కాంగ్రెస్ నాయకుడు రహమతుల్లా
9వ్యూస్ ప్రతినిధి కే సుదర్శన్ నవంబర్ 27: హనుమకొండ:హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన ఇనుగాల వెంకట్రాంరెడ్డి ని యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ రహమతుల్లా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రహమతుల్లా, వెంకట్రాంరెడ్డి కి శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ రహమతుల్లా మాట్లాడుతూ—
జిల్లా అధ్యక్షుడిగా ఇనుగాల వెంకట్రాంరెడ్డి నియామకం కాంగ్రెస్ వర్గాల్లో నూతన ఉత్సాహానికి, ఉద్యమాత్మక శక్తికి సంకేతమని అన్నారు. పార్టీ బలోపేతం, విభిన్న విభాగాల సమన్వయం, బూత్ స్థాయి కార్యకర్తల ప్రోత్సాహం వంటి కీలక రంగాలలో ఆయన నాయకత్వం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, యువతకు అవకాశాల కల్పనలో వెంకట్రాంరెడ్డి కృషి ప్రభావవంతంగా ఉండబోతుందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు—సమానత్వం, న్యాయం, సామాజిక శ్రేయస్సు—ప్రజలకు చేరువ చేసే దిశగా ఆయన నాయకత్వం దోహదపడుతుందని
ఆశాభావం తెలియచేశారు.
నూతన జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి,. మాట్లాడుతూ ...
తనకు అందుతున్న ప్రేమాభిమానాలు, విశ్వాసం పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను మరింత పెంచుతున్నాయని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ బృందాన్ని బలోపేతం చేయడంలో యువత పాత్ర అత్యంత కీలకమని, యువజన కాంగ్రెస్ నాయకులందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

