కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కు నియామకమైన పల్లవోలు యగ్నేష్ రెడ్డికు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నాయకులు

 కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కు నియామకమైన పల్లవోలు యగ్నేష్ రెడ్డికు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నాయకులు


అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ముడుపులు వేముల గ్రామం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, ప్రముఖ నాయకులు పల్లవోలు హేమ చంద్రారెడ్డి, పల్లవోలు లావణ్య దంపతుల కుమారుడు పల్లవోలు యగ్నేష్ రెడ్డి 



కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అండర్ 12 kSCA కు ఎంపిక అయిన సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ పీలేరు పట్టణ అధ్యక్షుడు దలవాయి సురేష్ కుమార్ రెడ్డి అలియాస్ కంచి సూరి, సీనియర్ నాయకులు జయ చంద్రా రెడ్డి అలియాస్ జయన్న, టిడిపి యువ నాయకులు కోటపల్లి గుర్రం నరేష్ కుమార్ రెడ్డి, పద్మావతి నగర్ కటారి సురేష్ హర్షం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లవోలు యగ్నేష్ రెడ్డి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ పోటీల్లో పాల్గొనడం, సంతోష దాయకమని, క్రికెట్ ఆటల పోటీల్లో పిన్న వయసులోనే ప్రతిభ కనబరుస్తూ రాణించాలని, అలాగే తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తూ అనేక విజయాలను సాధించే దిశగా ముందుకెళుతూ  


వారి ప్రోత్సాహంతో వారి కలను సాకారం చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరాలని, కర్ణాటక రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశంలోనే ఇండియన్ క్రికెట్ స్థాయికి ఎదగాలంటూ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశంసలు కురిపిస్తూ దీవెనలు అందించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.