అభివృద్ధి కావాలంటే భాజపాకే పట్టం కట్టండి బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి

 అభివృద్ధి కావాలంటే భాజపాకే పట్టం కట్టండి బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి



కథలాపూర్, (కోరుట్ల) నవంబర్: 28 (9వ్యూస్)జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు బిజెపి పార్టీ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో మునిగిందని మాట్లాడిన సీఎం రేవంత్ మరి గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పాలో తెలియజేయాలన్నారు. రెండు సంవత్సరాల తరువాత స్థానిక సంస్థలకు మోక్షం లభించిందని, రాష్ట్ర ఖజానాలో పైసల్ లేవని చెప్పిన ముఖ్యమంత్రి మరి గ్రామాలను ఏలా అభివృద్ధి చేస్తాడో చెప్పాలన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్రామాల అభివృద్ధి కుంటుపడేలా చేసిందని, అభివృద్ధి ఆమడ దూరంలో ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ గెలిస్తే కేంద్రం నుండి వచ్చే నిధుల ద్వారానే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, బండి సంజయ్ ప్రతిధులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి ఖాయమని అన్నారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే నిధులు తెచ్చి పల్లెలు అభివృద్ధి చేసే బాధ్యత బండి సంజయ్ తీసుకుంటారని స్పష్టం చేశారు. 


 కథలాపూర్ మండలానికి ఇప్పటి వరకు1 కోటి 30 లక్షల (NREGS)నిధులు మంజూరు చేసిన ఘనత కేంద్ర మంత్రి బండి సంజయ్ దేనని కథలాపూర్ మండల అధ్యక్షులు మల్యాల మారుతి స్పష్టం చేశారు. కథలాపూర్ మండలంలోని పదో తరగతి విద్యార్థులకు పరీక్ష పీజులను చెల్లించడానికి ముందుకొచ్చిన బండి సంజయ్ ఎన్నికలు లేకుండా సర్పంచ్ వార్డు మెంబర్ల ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు రూ. 10 లక్షలను బండి సంజయ్ ఇవ్వడానికి ముందుకొచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, మండల అధ్యక్షులు మల్యాల మారుతి, జిల్లా ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వర్రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు కంటే సత్యనారాయణ, కథలాపూర్ మహేష్, గాందారి శ్రీనివాస్, నరెడ్లరవి, అల్గొట్ ప్రమోద్, ఆరే శివ, మల్యాల శ్రీనివాస్, వీరేందర్, రాజేష్, సురేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.