బీజేపీ పార్టీలో చేరిన కాంగ్రెస్ తాజా మాజీ సర్పంచ్లు
కథలాపూర్, (కోరుట్ల) నవంబర్: 28 (9వ్యూస్) కథలాపూర్ మండలంలోని తాండ్రియాల తాజా మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు గడీల గంగా ప్రసాద్, గంభీర్ పూర్ మాజీ సర్పంచ్ గుంటుక మనోహర్ శుక్రవారం రోజు వేములవాడ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇంచార్జి డాక్టర్ చెన్నమనేని వికాస్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్ వికాస్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి బిజేపీ తోనే సాధ్యమవుతుందని ప్రజలు గ్రహించి బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, జిల్లా ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వర రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడలు కొడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు బద్రి సత్యం, ఆనంద్ రెడ్డి, జెలందర్, శ్రీను, తిరుపతి, గంగా మల్లయ్య, రాజేష్, లింగమూర్తి, సాయిరెడ్డి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

