అణగారిన వర్గాల అక్షరాస్యత సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహావీరుడు జ్యోతిబాపూలే

అణగారిన వర్గాల అక్షరాస్యత సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహావీరుడు జ్యోతిబాపూలే


ఘనంగా మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి....


ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎం జె ఎఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెట్టు పెళ్లి లక్ష్మణ్....



కోరుట్ల, నవంబర్ 28 (9వ్యూస్)జ్యోతిబాపూలే సమాజంలో అణగారిన వర్గాల కోసం అక్షరాస్యత, సమానత్వం మహిళ సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహా వీరుని పోరాటపటిమ స్ఫూర్తిదాయకమని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎం. జె. ఎఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెట్టుపల్లి లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం కోరుట్ల పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ

దేశ సామాజిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహనీయుల్లో ఒకరు మహాత్మా జ్యోతిబాపూలే సమాజంలో అణగారిన వర్గాల అక్షరాస్యత, సమానత్వం, మహిళా సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహావీరుని, పోరాట పటిమ స్ఫూర్తిదాయకం అని తెలియజేశారు."పూలే" జీవిత లక్ష్యం సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలు, కులవివక్షను నిర్మూలించే దిశ గా ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం. విద్య లేకుండా విముక్తి లేదు అనే ఆయన సందేశం నేటికీ సమాజానికి మార్గదర్శకం అని లక్ష్మణ్ అన్నారు.

 

బాలికల విద్య కోసం స్థాపించిన తొలి మహిళా పాఠశాల భారతీయ విద్యా చరిత్రలో విప్లవాత్మకమని అన్నారు. బలహీన వర్గాల కోసం పోరాడిన ఒక మహానీయుడు ప్రతి ఒక్కరం "పూలే" ఆలోచనలను ఆచరణగా తీసుకొని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా వెళ్లాలని చెట్టుపెళ్లి లక్ష్మణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మరియు వికలాంగులు, అనుబంధ సంఘ నాయకులు వొడ్నాల శ్రీనివాసరావు, చెట్టుపెల్లి ఓం ప్రకాష్, చిట్యాల లచ్చయ్య, మంగ సాయి నిఖిల్,గట్ల సాయిప్రసాద్, వంక గంగాధర్, బండారి శీను, చెట్టుపెళ్లి యశ్వంత్, ప్రత మహేష్ మహేష్, చిట్యాల వర్షిత్, బెక్కం వర్షిత్, తెడ్డు సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.