కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాజీపేట బాపూజీనగర్ చౌరస్తాలో ఘనంగా జ్యోతి బా ఫూలే వర్ధంతి

 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాజీపేట బాపూజీనగర్ చౌరస్తాలో ఘనంగా జ్యోతి బా ఫూలే వర్ధంతి



9 వ్యూస్ ప్రతినిధి కే సుదర్శన్ నవంబర్ 28: 47వ డివిజన్ అధ్యక్షుడు అజ్గర్, ఇప్ప శ్రీకాంత్, కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు మైసారపు సిరిల్ లారెన్స్ నేతృత్వంలో



కాజీపేట బాపూజీనగర్ చౌరస్తాలో జ్యోతి బా ఫూలే వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 47వ డివిజన్ అధ్యక్షుడు అజ్గర్, ఇప్ప శ్రీకాంత్ మరియు కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు మైసారపు సిరిల్ లారెన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మహాత్మ జ్యోతి బా ఫూలే చిత్రపటానికి పూలమాలను అర్పించి నివాళులు ఘటించారు.


ఈ సందర్భంగా మాట్లాడిన కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు సిరిల్ లారెన్స్ మాట్లాడుతూ—

“మహాత్మా జ్యోతి బా ఫూలే భారత సమాజ సంస్కరణలో అగ్రగణ్యులు. అణగారిన వర్గాల సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు. మహిళా విద్యను ప్రోత్సహించి, కుల వివక్షను, అంటరానితనాన్ని నిర్మూలించడానికి గొప్ప కృషి చేశారు. అణచివేయబడిన వర్గాలకు ఆత్మవిశ్వాసాన్ని కల్పించి, వారి హక్కుల కోసం ఉద్యమించారు. తన భార్య సావిత్రిబాయి ఫూలేతో కలిసి దేశంలోనే తొలి బాలికల పాఠశాల స్థాపించారు” అని తెలిపారు.


ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోల్కొండ రాంబాబు, దొంగల కుమార్ యాదవ్, తమ్ముడి మధు, సిలువేరు విజయభాస్కర్, కొమురవెల్లి రమేష్, నీలం భానుచందర్, తిరుపతి శ్రీనివాస్, ఎండి మదర్, ఇమ్మడి రవి, సిలువేరు మల్లికార్జున్, నాగ మహేష్, సిరిపాక కుమార్ స్వామి, పోగుల శ్రీనివాస్, మాతంగి స్వామి, దార్ల రాజ్ కుమార్, కర్రీ రమేష్, బండారి నర్సింగరావు, యాదగిరి, సిరుకుపల్లి సుధాకర్ రావు, ఎండి సాజిద్, గాజుల లక్ష్మణ్, రమేష్ సాధురం, రాజు, నాతరి శ్రీనివాస్, రాజన్న, తండా అశోక్, గౌడ్ భద్రయ్య, ఎర్ర రాజేష్, బాపూజీ నగర్ ట్రైసిటీ ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.