ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి
పీలేరులోని బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి.
వర్ధంతి సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో పీలేరు మార్కెట్ కమిటీ ఎదురుగా ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు బలరాం మాట్లాడుతూ దేశంలోని తాడిత, పీడిత, బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలతో పాటు మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే అహర్నిశలు కృషి చేశారన్నారు.
ఆయన ఆలోచనలు, ఆశయాలు నేటికీ మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయన్నారు.
ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకి అర్పించే నివాళులు అన్నారు.
బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ లోని సభ్యుల పిల్లల విద్యాభ్యాసం కోసం ఈ సందర్భంగా స్టేషనరీ సామాగ్రిని వితరణగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రాజు, పీలేరు మండల అధ్యక్షులు రామయ్య, సభ్యులు చంగల్ రాయుడు, రాజా, సోమశేఖర్, రమేష్, షణ్ముగం, రాజేంద్ర, మల్లికార్జున, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

