మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం
తెలంగాణ మైనారిటీస్ సంక్షేమ కళాశాల బాలికల కోసం సమావేశం.
9 వ్యూస్ ప్రతినిధి కే సుదర్శన్ నవంబర్ 11: హన్మకొండ:హన్మకొండ హంటర్ రోడ్‌లోని తెలంగాణ మైనారిటీస్ సంక్షేమ కళాశాల బాలికల కోసం–1 లో ఈ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ మరియు యాజమాన్యం సమన్వయంతో నిర్వహించారు.
కార్యక్రమానికి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కె.ఎ. ఘౌస్ హైదర్, హన్మకొండ జిల్లా మైనారిటీ చైర్మన్ మీర్జా అజీజుల్లా బైగ్, వైస్ చైర్మన్ ఎం.ఎ. షబ్బీర్ .వైస్ చైర్మన్ అబ్దుల్ బాకీ, మరియు ప్రధాన కార్యదర్శి సమీ ఉల్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ముఖ్య అతిథులు విద్యార్థులతో చర్చిస్తూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జీవితం, దేశానికి ఆయన చేసిన సేవలు, స్వాతంత్ర్య పోరాటంలో పాత్ర, కాంగ్రెస్ పార్టీ లో ఆయన సంఘర్షణలు, మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన రచనలు, కవిత్వం ద్వారా చూపిన ప్రతిఘటన గురించి ప్రేరణాత్మకంగా వివరించారు.
కార్యక్రమం ముగింపులో ముఖ్య అతిథులను కళాశాల యాజమాన్యం బొకేలు మరియు శాలువాలతో ఘనంగా సన్మానించింది. అదేవిధంగా ఖురాన్ పూర్తిగా పఠించిన విద్యార్థినులను పూలమాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఆలోచనలు, విద్యాప్రేమం ప్రతి విద్యార్థికి ఆదర్శమని, ఆయన బాటలో నడుస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.

