సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఎస్సై రామచంద్రం....
కోరుట్ల, నవంబర్: 11 (9వ్యూస్)ఆర్బిఐ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం మేడిపల్లి వారి ఆధ్వర్యంలో కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామంలో సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపిడివో రామకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా యువత సైబర్ నేరాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ అప్స్ వల్ల సైబర్ నేరాలకు గురవుతున్నారని, ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ ని డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. డిజిటల్ అరెస్ట్ అంటూ వచ్చే కాల్స్ కి బయపడవద్దని, యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు ఆకర్షితులవున్నారని, ఎటువంటి లోన్ యాప్స్ లో లోన్ తీసుకుని జీవితాలను దుర్బరం చేసుకుంటున్నారని అన్నారు. మీకు సైబర్ మోసానికి గురి అయినట్లు తెలిసిన వెంటనే 1930 నెంబర్ కు కాల్ చెయ్యాలని అన్నారు. యూపీఐ ల ద్వారా డబ్బులు అడిగితే పంపవద్దని సైబర్ మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో రామకృష్ణ, ఎస్సై రామచంద్రం, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజరు శ్రవణ్, ఎపిఎమ్ సమతా, మాజీ సర్పంచ్ పిడుగు సందయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంతం రాజం, కాంగ్రెస్ నాయకులు నగునూరి గంగాధర్, ప్రొఫెసర్ అర్చన, అసిస్టెంట్ ప్రొఫెసర్ రత్నాకర్, పంచాయతీ కార్యదర్శి నవీన్, కారోబార్ అశోక్, అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు నాగేంద్ర ప్రసాద్, నవీన్, ప్రజలు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.

