లెక్కింపు అనంతరం విజయ దరహాసంలో రామా వజ్జల పానల్.
సవంబర్ 11 భద్రాచలం 9వ్యూస్:ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఎన్నికలలో రామావజల ప్యానల్ విజయపతాక ఎగురవేసింది.
![]() |
| నూతన కార్యవర్గ సభ్యులు |
మంగళవారం భద్రాచలం స్నానఘట్టాల వద్ద వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోజరిగిన బ్రాహ్మణ పురోహిత సంఘం ఎన్నిక లు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు జరిగాయి. అధ్యక్షులుగా పోటీ చేసిన రామా వజ్జల. రవికుమార్ శర్మ24 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా ప్రధాన కార్యదర్శిగా ఆర్. పవన్ కుమార్ శర్మ తన ప్రత్యర్థి ఇంగువ రామకృష్ణ శాస్త్రి పై36ఓట్ల మెజార్టీ సాధించారు. కోశాధికారిగా ప్రతాపురం నరసింహాచార్యులు, ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఉపాధ్యక్షులుగా సిరిపురపు. అశోక్ కుమార్ శర్మ, మోటుపల్లి. వేణుగోపాలచార్యులు, భాస్కరుని సత్యప్రసాద్ శర్మ సహాయ కార్యదర్శిగా ఆర్.వి శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీగా కోవూరు కేదార్నాథ్, ప్రచార కార్యదర్శిగా కంజర్ల. జగన్ ఎన్నికగా, కాకరాల. శ్రీనివాస్ శర్మ, ఎస్ ,రాజేశ్వర శర్మ, ప్రతాపురం నరసింహాచార్యులు ఎన్నికల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ ఎన్నికలలో కూడా4 ఖాళీ బ్యాలెట్ పేపర్లు ఫోల్ కావడం విశేషం.

