బృందావన్ కాలనీలో మురికికాలువల సమస్య – కాలనీ వాసుల తీవ్ర ఇబ్బందులు
9 వ్యూస్ ప్రతినిధి కే సుదర్శన్ నవంబర్ 11:63వ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో మురికికాలువలు లేకపోవడం స్థానిక ప్రజలకు తలనొప్పిగా మారింది. గృహాల నుంచి వచ్చే మురుగు నీరు వీధుల్లోకి చేరి నిల్వవడంతో దుర్వాసన వ్యాపిస్తోంది. వర్షాలు పడినప్పుడల్లా పరిస్థితి మరింత దారుణంగా మారి, రహదారులు పూర్తిగా చెరువుల్లా మారిపోతున్నాయని కాలనీ వాసులు వాపోయారు.
మురికినీటి నిల్వ వల్ల దోమలు, దుర్వాసన, దోమల ద్వారా వ్యాపించే రోగాలు విస్తరిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు, వృద్ధులు ఇలాంటి పరిస్థితుల్లో బయటకు రావడానికి కూడా భయపడుతున్నారని పేర్కొన్నారు.
కాలనీ ప్రతినిధులు పలు మార్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) అధికారులకు, స్థానిక డివిజన్ కార్పొరేటర్‌కి ఫిర్యాదులు చేసినప్పటికీ, సమస్య పరిష్కారం దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాలనీలో శాశ్వత పరిష్కారం కోసం తక్షణమే మురికికాలువ నిర్మాణ పనులు చేపట్టాలని, డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
“ప్రజల ఆశలు అధికారులు మరియు డివిజన్ కార్పొరేటర్ స్పందించి చర్యలు తీసుకోవడంపైనే ఉన్నాయి,” అని కాలనీ వాసులు తెలిపారు.

.jpg)