లారీ ఢీకొని యువకుని మృతి
కథలాపూర్ (కోరుట్ల) నవంబర్: 11 (9వ్యూస్)లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన కథలాపూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన జవిడి రఘుపతి రెడ్డి అనే యువకుడు తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోసుకొని తిరిగి వెళుతుండగా ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడు చిన్న వయసు కావడంతో బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు మృతదేహాన్ని స్వాధీన పరుచుకుని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
![]() |
| మృతుని ఫైల్ ఫోటో |

