రాష్ట్రస్థాయి కోకో పోటీలకు కేపిఎస్ విద్యార్థులు
కోరుట్ల, నవంబర్ 13 (9వ్యూస్ ) ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్ 14 బాలురు, బాలికల ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు నవంబర్ 11 తేదీన కథలాపూర్‌లోని మాస్ట్రో హై స్కూల్ లో నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో అండర్ 14 విభాగoలో జగిత్యాల జిల్లా బాలుర ఖో-ఖో జట్టు మొదటి స్థానం, బాలికల జట్టు రెండవ స్థానం సాధించాయి. ఈ విజయాల్లో కేపిఎస్ విద్యార్థులు అల్లే నీరజ్, హేమ కెప్టెన్లుగా నాయకత్వం వహించగా, మరొక విద్యార్థిని చార్వి కీలక పాత్ర పోషించి బంగారు, వెండి పతకాలు గెలుచుకొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు కేపిఎస్ కరస్పాండెంట్ గుజ్జెటి వెంకటేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేపిఎస్ కి ఎంపిక కావడం గర్వకారణమని, వారి కృషి, క్రమశిక్షణ, పాఠశాల ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లిందని అన్నారు. ఎన్నికైన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేష్, క్రీడోపాధ్యాయులు అభినందించారు.

