విద్య, శాంతి, క్రమశిక్షణకు నిలయాలు పాఠశాలలు
భౌతిక దాడులను తీవ్రంగా ఖండించిన ట్రస్మా....
కోరుట్ల, నవంబర్ :13 (9వ్యూస్) వరంగల్‌లో ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. కొంతమంది విద్యార్థి సంఘ సభ్యులు పాఠశాల యాజమాన్యంపై శారీరక దాడికి పాల్పడగా ఈ ఘటనను ట్రస్మా కోరుట్ల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని ట్రస్మా ప్రెసిడెంట్ భారీ, సెక్రటరీ వెంకటేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా కోరుట్లకు చెందిన పాఠశాల నిర్వాహకులు, ప్రతినిధులు కేరళ స్కూల్ లో సమావేశమై ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వారు మాట్లాడుతూ పాఠశాలలు విద్య, శాంతి, క్రమశిక్షణకు నిలయాలని, ఇలాంటి చర్యలు విద్యా వాతావరణాన్ని భంగపరుస్తాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, విద్యార్థి నాయకులు సంయమనంతో సత్సంబంధాలను కలిగివుండాలని ట్రస్మా కోరుట్ల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. అలాగే బాధిత పాఠశాల యాజమాన్యానికి పూర్తి మద్దతు తెలుపుతున్నామని అన్నారు. ఈ సమావేశములో వివిధ స్కూల్స్ కరస్పాండెంట్స్
ఎం.ఏ. బారి, వెంకటేశ్, దీపక్, మహాదేవ్, సత్యనారాయణ,
బాలాజీ దామోదర్, రమేశ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

