బిజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు
కథలాపూర్, (కోరుట్ల) నవంబర్ :15 (9వ్యూస్) భారతీయ జనతా పార్టీ కథలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం రోజు బీహార్ లో బీజేపీ విజయం డంకా మోగించిన సందర్బంగా మండల అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణి చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహార్లో బీజేపీ కీ విజయాన్ని అందించిన బీహార్ ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తున్న తరుణంలో బీహార్ ప్రజలు బీజేపీ నీ గెలిపించుకోవడం పట్ల హార్షం వ్యక్తం చేసారు. రాబోవు రోజుల్లో భారత్ మొత్తం కాషాయమయం అవుతుందని సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, గాందారి శ్రీనివాస్, నరెడ్ల రవి, ఆరే శివ, యాటకర్ల అశోక్, బండ అంజయ్య, నారాయణ, ప్రణీత్, సునీల్ ప్రసాద్, కిషోర్, కమలాకర్, తిరుపతి, రాము, రాజేష్, భూమేష్, సాయిరెడ్డి, జెలందర్, నాగేష్ పాల్గొన్నారు.

