బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరసన, విధుల బహిష్కరణ
కోరుట్ల, నవంబర్: 13 (9వ్యూస్) నిర్మల్ కోర్టు ప్రాంగణంలో న్యాయవాది పుట్ట అనిల్ కుమార్ పై పోలీస్ దాడిని నిరసిస్తూ కోరుట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రోజు న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్ మాట్లాడుతూ నిర్మల్ లో జరిగిన దాడిని న్యాయ వ్యవస్థపైనే దాడులుగా భావిస్తున్నామన్నారు. న్యాయ పరిరక్షణ, న్యాయవాదుల భద్రతకై అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలులోకి తేవాలని డిమాండ్ చేసారు. భవిష్యత్‌లో న్యాయవాదులపై దాడులు జరిగితే న్యాయవాదుల మంత ఏకమై పోరాడతామన్నారు. అనంతరం ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాల మౌన నివాళులు అర్పించి, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కొంపల్లి సురేష్, జాయింట్ సెక్రటరీ చిలివేరి రాజ శేఖర్, న్యాయవాదులు కొలుగూరి శ్రీపతిరావు పలువురు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

